మగవాళ్ల నుంచి మహిళలకు ఎక్కడలేని ప్రశంసలు వస్తుంటాయి. చీరకట్టు నుంచి నడుం ఒంపుసొంపుల వరకు, నయన సౌందర్యం నుంచి వక్షోజాల వరకు ఆమెను పురుషుడు మెచ్చుకుంటూ ఉంటాడు. కానీ, పురుషులు మహిళల నుంచి అటువంటి ప్రశంసలను చాలా అరుదుగా వింటారు. మహిళలు తమ పురుష భాగస్వామిని వలలో వేసుకుని, అతనికి ఆనందాన్ని ఇవ్వాలంటే అటువంటి ప్రశంస జల్లు కొంత కురిపిస్తే మంచిదని కామశాస్త్ర నిపుణులు అంటున్నారు. మీ పురుషుడిపై మీరు అర్థవంతమైన వ్యాఖ్యలు చేస్తే రాత్రిపూట పడక గది ఆనందడోలికల్లో ఊగిపోతుందని గుర్తించండి.
ఈ పని చేయగలవు
నువ్వు ఏ పని చేయగలవు, నీకు ఆ సత్తా ఉందని మీ మగవాడిని అనేసేయండి. అతడెంత ఉప్పొంగిపోతాడో, అతనికి ఎంత శక్తి వస్తుందో మీరే గుర్తిస్తారు. మీరు ఆ మాట అన్న తర్వాత అత్యంత నైపుణ్యంతో పని చేసి తన సత్తాను చాటుకుంటాడు.
నువ్వు లేకుండా నేనుండగలనా అని చెప్పండి
నువ్వు లేకుండా నేను ఉండగలనా అని ముద్దుమురిపాలు ఒలకబోస్తూ అనండి. తాను లేకుండా మీరు ఉండలేరనే భావన అతన్ని మీ కౌగిట్లోకి మరింత ఆనందంతో తీసుకుని వస్తుంది. అతడ్ని బిగి కౌగిలిలో బంధించి నువ్వు తప్ప నాకేమీ వద్దని అనండి. అప్పుడు చూడండి అతని దూకుడు.
నాతో గడపవా అని అనండి
మీరు అప్పుడప్పుడు మీ పురుషుడి అంతరంగాన్ని తట్టి లేపుతూ ఉండాలి. అతని చూపులపై, నైపుణ్యాలపై మీరు ఎంతటి ప్రశాంసాత్మక వ్యాఖ్యలు చేశారనేది ముఖ్యం కాదు. అతన్ని మీరు ఎంతగా ప్రేమిస్తున్నారో, అతని సాన్నిహిత్యాన్ని ఎంతగా కోరుకుంటున్నారో వెల్లడించండి. నాతో మరింత సేపు ఉండిపోవా అని గారాలు పోండి. దానివల్ల మీ ఇద్దరి మధ్య మరింత సాన్నిహిత్యం పెరుగుతుంది.
నీ తెలివి చూడతరమా...
మీ పురుషుడి తెలివిని మెచ్చుకోండి. తన లక్ష్యం పట్ల ప్రతి పురుషుడి గురి పెడతాడు. తాను చాలా తెలివి కలవాడినని భావిస్తూ ఉంటాడు. నువ్వు చాలా తెలివిగలవాడివి మీరు ప్రశంసిస్తే అతను ఉప్పంగిపోతాడు. పని పట్ల చూపుతున్న అంకిత భావాన్ని, చేస్తున్న శ్రమను ప్రశంసించండి. అది అతన్ని కదిలించి వేస్తుంది.
నీ మీద మనసవుతుంది
మీరు అతన్ని కోరుకుంటున్నారని చేతల ద్వారా చూపగలిగితే అతను ఎగిరి గంతేసి మీ కౌగిట్లో బందీ అవుతాడు. అతని శరీరాన్ని స్పర్శించండి. అతని శరీరంలోని వివిధ అంగాలను స్పర్శిస్తూ మీ కోరికను చేతల ద్వారా వెల్లడించండి. అతను వచ్చి మీ ఒళ్లో వాలకపోతే ఒట్టు.
No comments:
Post a Comment