Tuesday, September 18, 2012

స్త్రీలలో వచ్చే మూత్రనాళ ఇన్ఫెక్షన్


పెళ్లయిన కొత్తలో శృంగారం ఆనందాన్నిచ్చేదిగా కాక మంట-నొప్పితో మూత్ర-జననవయవాల్లో పెళ్లికూతురిని బాధిస్తూ ఉంటే అది ఖచ్చితంగా హనీమూన్ సిస్టయిటిస్ చెప్పవచ్చు.   వైద్య పరిభాషలో దీన్ని మూత్రనాళ ఇన్ఫెక్షన్ (UTI) అంటారు. ఇది స్త్రీలకే ఎక్కువగా వస్తుంది. సరైన సమయంలో గుర్తించి చికిత్స ఇవ్వకపోతే ఇది మూత్రాశయానికి, కిడ్నీలకు పాకుతుంది.

లక్షణాలు : 
మూత్ర విసర్జన సమయంలో మంట, నొప్పి మాటి మాటికీ మూత్రం పోయాలన్పించడం, మూత్రం రంగు మబ్బుగా ఉండటం, కొన్నిసార్లు రక్తపు చారలు ఉండటం, బొడ్డు కింది పొత్తి కడుపు కింది భాగంలో నొప్పి, 100 నుంచి 104 డిగ్రీల వరకూ జ్వరం, ఒళ్లు నొప్పులు, చలి.

కారణం : 
ఈ-కొలి (E-coli) లాంటి బాక్టీరియా మూత్రద్వారం లోపలికి వ్యాపించి, ఇవి విభజన చెందితే ఇన్‌ఫెక్షన్‌గా మారుతుంది. ఈ బాక్టీరియా సహజంగా పెద్ద పేగుల్లో ఉంటుంది. కలయిక తర్వాత వచ్చే ఈ ఇన్ఫెక్షన్, ఇతర సందర్భాలలో అపరిశుభ్రమైన వేళ్లు-పురుషాంగం, లేదా పెద్దపేగు చివరి భాగమైన పాయువు లేదా ఏనస్ (మలద్వారం)ను తగిలి అక్కడ్నించి యోనిలోకి ప్రవేశించవచ్చు. మల విసర్జన తర్వాత ఏనస్ నుంచి వ్జై వైపుకు నీటితో శుభ్రం చేస్కునే స్త్రీలలో ఇది ఎక్కువ. వ్జై నుంచి ఏనస్ వైపుకు శుభ్రం చేస్కోవడమే ఉత్తమం!

సాధారణంగా ‘ఈ-కొలి’ బ్యాక్టీరియా మూత్రద్వారంలోకి ప్రవేశించిన ఒకటి లేదా రెండు రోజుల్లో ఈ లక్షణాలు బయటపడుతాయి. మూత్రపరీక్ష, మూత్ర కల్చర్ ద్వారా మూత్రంలో పస్ సెల్స్, బాక్టీరియా కన్పిస్తాయి.

చికిత్స : 
ఒకసారి యురిత్రైటిస్ లేదా సిస్టయిటిస్‌కి కారణం కనుక్కున్న తర్వాత ఖచ్చితంగా వారం రోజులకు యాంటీబయాటిక్ కోర్సు వాడాలి. దానితో పాటు (పైరిడియం లాంటి) జ్వరం, నొప్పి తగ్గే మాత్రలు వాడితే మూత్రంలో మంట, నొప్పి తగ్గిపోతాయి. అలాగే ఇన్ఫెక్షన్ తగ్గే దాకా సెక్స్‌లో పాల్గొనకూడదు.

‘సిస్టయిటిస్’ రాకుండా జాగ్రత్తలు :
  • ప్రతి రోజూ 8-10 గ్లాసుల కంటే ఎక్కువగా నీరు తాగడం.
  • కొబ్బరి బోండాలు తాగడం
  • కాఫీ, టీ లాంటివి తక్కువ వాడడం
  • కలయిక వెంటనే మూత్ర విసర్జన చేస్తే బాక్టీరియా బైటకు వెళ్లిపోతుంది.
  • ఇన్ఫెక్షన్ తగ్గేవరకూ సెక్స్‌కు దూరంగా ఉండటం మంచిది.
  • అంతగా తప్పనిసరి అయితే నీటి ఆధారిత లూబ్రికెంట్‌ని యోని చుట్టూ వాడాలి.
  • కొద్దిగా లోపలవైపు రాసుకుంటే కలయిక సులభంగా జరుగుతుంది.
  • ఇన్‌ఫెక్షన్ హనీమూన్ తర్వాత కూడా మళ్ళీ వస్తే తప్పనిసరిగా యూరాలజిస్ట్‌ను కానీ, గైనకాలజిస్ట్‌ను కానీ సంప్రదించాలి.
  • గోరు వెచ్చని, సబ్బులేని (నాన్ సోప్ వాటర్) సిట్జ్ బాత్ మంచిది.

No comments:

Post a Comment