‘ఐ-పిల్’ పదే పదే వాడటం మంచిది కాదు. అది కేవలం వివాహిత స్త్రీలు అసురక్ష సెక్స్‌లో అంటే క్రమం తప్పక వాడే కుటుంబ నియంవూతణ బిళ్ళలు వాడనప్పుడు, అవి అందుబాటులో లేనప్పుడు, కండోమ్ చిరిగిపోయినప్పుడు, కొన్ని అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే వాడవలసిన, అత్యవసర గర్భ నిరోధక మాత్ర. దీనిని ఎప్పుడంటే అప్పుడు, ఎన్ని సార్లంటే అన్ని సార్లు వాడకూడదు. కానీ, ప్రభుత్వం కంపెనీలతో మిలాఖత్ అవడం వల్ల విస్తృతంగా టీవీ ప్రకటనల్లో చూపిస్తున్నారు. దీనివల్ల దుష్ర్పభావాలు తెలియక చాలామంది దీన్ని సులువుగా వాడుతున్నారు. గైనకాలజిస్ట్‌లను కూడా సంప్రదించడం లేదు.
‘ఐ-పిల్’ వల్ల కలిగే దుష్ఫలితాలు:
వాంతులు, వికారం, తలనొప్పి, ఆకలి మందగించడం, వక్షోజాల్లో నొప్పి, యోని నుంచి రక్తవూసావం, శరీరంలో వాపు, నెలసరి మధ్యలో,
నెలసరికి సంబంధం లేకుండా రక్త స్రావం కావడం, తీవ్రమైన అలెర్జిక్ రియాక్షన్స్ అంటే దురద, మంట, శ్వాసలో ఇబ్బంది, ఛాతి బిగుసుకు పోవడం, గొంతు, నాలుక, పెదాలలో వాపు రావడం, ఒక్కోసారి నెలసరి పూర్తిగా ఆగిపోవడం, వక్షోజాల నుంచి నీరు రావడం, మూత్ర విసర్జనలో మార్పులు, శరీరం ఒకవైపు తిమ్మిక్కి బలహీన పడటం, పైగా బీపీ, అడ్వాన్స్‌డ్ డయాబెటిస్8, మైగ్రేన్ వ్యాధి, కామెర్లున్న వారు, రక్తం గడ్డ కట్టే చరిత్ర ఉన్న వారు వీటిని వాడకూడదు. కాబట్టి, మీ ఆరోగ్యం మీకు చాలా ముఖ్యం. మీకు సందేహం, అభ్యంతరం, అభవూదత ఉన్నపుడెందుకు వాడతారు? పర్యవసానాలు మీరే అనుభవించాలి. కాబట్టి, నిర్ద్వద్వంగా తిరస్కరించండి. కాబట్టి, కండోమ్ మంచిది. అలాగే, సేఫ్ పీరీయడ్స్‌లోనే మీ భర్త మీ వద్దకు వచ్చేట్లు చూస్కోండి. యోనిలో కలయికకు ముందు (అంగప్రవేశానికి 15 నిమిషాల ముందు) పెట్టుకునే టుడే వెజినల్ పెస్పరీస్8 అనే మాత్రలు గైనకాలజిస్ట్ పర్యవేక్షణలో వాడవచ్చు. ‘ఐ-పిల్’ ఎంత మాత్రమూ మంచిది కాదు.
No comments:
Post a Comment