Tuesday, September 18, 2012


నవీన యుగంలో లింగ విచక్షణ లేకుండా రానురాను మధుమేహ వ్యాధి గ్రస్తుల సంఖ్య పెరిగి పోతోంది. భారత దేశంలో వీరి సంఖ్య నానాటికి పెరిగిపోతోంది. మధుమేహం లేదా డయాబెటిస్ వ్యాధికి కారణాలు అనేకం ఉన్నా కానీ మానసిక ఒత్తిడి, ఆందోళన వంటి మానసిక కారణాలే ముఖ్యమైనవి. కచ్చితంగా చెప్పాలంటే డయాబెటీస్ ఒక వ్యాధి కాదు. ఇది ఒక మెటబాటలిక్ డిసార్డర్. అంటే శరీరంలో జీవక్షికియ సరిగ్గా జరగకపోవడం వల్ల రక్తంలో, మూత్రంలో చక్కెర శాతం పెరిగిపోవడం వల్ల ఏర్పడే స్థితి మాత్రమే. డయాబెటీస్ లక్షణాలైన అతి మూత్రం, అధిక దాహం, ఆకలి, శారీరక దౌర్భల్యం ఇవన్నీ జీవక్షికియలు సరిగా జరగకపోవడం వల్ల వచ్చేవే. దీనికి కారణం శరీరంలో పాంక్రియాస్ అనే గ్రంథి నుంచి వెలువడే ఇన్సులిన్ అనే హార్మోన్ సరిగ్గా ఉత్పత్తి కాకపోవడం లేదా దానిని శరీరం సరిగ్గా వినియోగించుకోకపోవడమే. ఇన్సులిన్ ఉత్పత్తి ని బట్టి డయాబెటిస్ రెండు రకాలు.
డయాబెటీస్‌లో ఇన్సులిన్ ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోవడం లేదా పూర్తిగా ఆగిపోవడం జరుగుతుంది. దీనికి కారణం పాక్రియాటైటిస్ వంటి ఇన్ఫెక్షన్ లేదా ఆటో ఇమ్యునిటీ వల్ల పాంక్రియాస్ గ్రంథిలో బీటాకణాలు పూర్తిగా నాశనం అవడమే. ఇన్సులిన్ ఉత్పత్తి నిలిచిపోవడం వల్ల శరీరంలో కార్బోహైవూడేట్ మెటబాలిజం దెబ్బతిని మనిషి స్పృహకోల్పోయి కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉంది.

అందువల్ల వీరికి బయటనుంచి ఇన్సులిన్‌ని ఇంజక్షన్ రూపంలో అందిస్తారు. అందుకే ఈ రకం డయాబెటీస్‌ని ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ మెల్లిటస్ (ఐడిడిఎం) అని అంటారు.

ఇన్సులిన్ ఉత్పత్తి సరిగానే ఉన్నప్పటికి శరీరం దానిని సరిగ్గా వినియోగించుకోలేని పరిస్థితినే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని అంటారు. ఇది సాధారణంగా ఊబకాయం ఉన్నవారిలో, మద్యం సేవించే వారిలో, శారీరక శ్రమలేకుండా స్థిరంగా ఉండే వారిలో ఎక్కువగా కనిపిస్తుంది. వీరికి ఇన్సులిన్ బయటి నుంచి ఇచ్చే అవసరం ఉండదు కానీ రక్తంలో చక్కెర శాతాన్ని నియంవూతించే మందులను సూచిస్తారు. అందుకే దీనిని నాన్-ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ మెల్లిటస్ (ఎన్‌ఐడిడిఎం) అని అంటారు. అయితే వీరిలో కూడా షుగర్ లెవల్స్ టాబ్లెట్ల ద్వారా నియంవూతించ లేకపోతే ఇన్సులిన్ ఇంజక్షన్ సిఫారసు చేస్తారు. డయాబెటీస్ వల్ల వచ్చే లక్షణాలే ఇబ్బంది కరంగా ఉంటే దాని వల్ల తలెత్తే కాప్లికేషన్లు పేషంట్‌ను మరింత కుంగ దీస్తాయి. కొన్ని రకాల కాంప్లికేషన్లు అకస్మాత్తుగా తీవ్రంగా వస్తాయి. షుగర్ లెవెల్స్‌ని సరిగ్గా నియంవూతించకపోతే డయాబెటిక్ కీటో ఎసిడోసిస్ అనే సమస్య తలెత్తుతుంది.

మందులు వేసుకుంటూ ఆహారం సరిగ్గా తీసుకోకపోవడం వల్ల చక్కెర స్థాయి తగ్గి హైపోగ్లైసీమియా తలెత్తుతుంది. శరీరమంతా చెమటలు రావడం, వణుకు, విపరీతమైన నీరసానికి గురయ్యి కళ్లు తిరిగి పడిపోవడం వంటి లక్షణాలు హైపోగ్లైసిమియాకి గురైన వ్యక్తిలో కనిపిస్తాయి. రక్తనాళాలలో వచ్చే మార్పుల వల్ల హృద్రోగాలు, కంటిచూపు మందగించడం (డయాబెటిక్ రెటీనోపతి), మూత్రపిండాలు దెబ్బతినడం (డయాబెటిక్ నెఫ్రోపతి) వంటి కాంప్లికేషన్స్ దీర్ఘకాలంగా డయాబెటీస్‌తో బాధ పడే వారిలో కనబడతాయి. తరచుగా కనబడే కాంప్లికేషన్స్ న్యూరోపతి లేదా నరాల సమస్య. దీని వల్ల అరికాళ్లలో, చేతుల్లో మంటలు, తిమ్మిర్లు, చీమలు పాకుతున్నట్లుండడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. గాయాలు సరిగా మానకపోవడం, జననేంవూదియాల్లో దురదలు, లైంగిక సమస్యలు వీరిని కుంగదీస్తాయి. సూక్ష్మనాళికలు దెబ్బతినడం వల్ల రక్తవూపసరణ సరిగ్గా జరగక వచ్చే గ్యాంగ్రీన్ వంటి సమస్యల వల్ల కొన్నిసార్లు అవిటితనం తలెత్తే అవకాశం ఉంటుంది.ఈ దుష్ర్పభావాలను అరికట్టడానికి రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుకోవల్సిన అవసరం ఉంది. గ్లూకోజ్ లెవెల్స్ సాధారణంగా భోజనం తర్వాత 160 ఎంజీ/డిఎల్ కంటే తక్కువ ఉండేలా చూసుకోవాలి.

కొంత మందిలో రక్తంలో గ్లూకోజ్ స్థాయిని నియంవూతించుకున్నా గానీ కాంప్లికేషన్స్ మొదలవుతాయి. క్రమంగా వ్యాయామం చేస్తూ మందులు, ఆహారం సమయానికి తీసుకుంటూ, చిన్నచిన్న జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. మానసిక ఒత్తిడిని కూడా తగ్గించుకొని సాధ్యమైనంతగా మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవాలి. హోమియోపతిలో ఇచ్చే కాన్స్‌టిట్యూషనల్ చికిత్స ద్వారా రోగి ప్రతీ సమస్యను అదుపు చేయగల మందులు ఉంటాయి.

ఈ చికిత్స ద్వారా కేవలం షుగర్ లెవెల్స్ కంట్రోల్ చెయ్యడమే కాకుండా కాంప్లికేషన్స్‌ను నివారించడం, ఉన్నవారిలో కాంప్లికేషన్స్‌ని తొలగించడానికి సహాయపడుతుంది. హోమియోపతి అనగానే డయాబెటిస్‌కి యాసిడ్ ఫాస్ యురేనియమ్‌నైట్ వంటి మందులే ఉన్నాయని అనుకుంటారు. ఇది సరియైన పద్ధతి కాదు. జన్యుపరమైన, మానసికమైన కారణాలను పరిగణిస్తూ, వ్యక్తిగత లక్షణాలపై కేంద్రీకరిస్తూ ఇచ్చే కాన్స్‌టిట్యూషనల్ రెమిడీ ద్వారా చక్కని ఫలితం లభిస్తుంది. సరియై మందులను, సరిపడే మోతాదులో నిర్ణీత కాలం దాకా వాడితే రోగుల్లో ఇన్సులిన్ డోసేజ్‌ని తక్కువ చేయడం, రోగుల్లో యాంటీ హైపర్‌గ్లైసిమిక్ డ్రగ్స్ మోతాదుని క్రమంగా తక్కువచేయడం, పూర్తిగా నిలిపి వేసే అవకాశం కూడా ఉంది. హోమియోపతి మందుల ద్వారా డయాబెటిక్ బాధితులు ఆరోగ్యకరమైన, ఆనందకరమైన జీవితాన్ని సొంతం చేసుకోవచ్చు.

No comments:

Post a Comment